ప్రతిఒక్కరి జీవితంతో చెలగాటం ఆడుతున్న కరోనా. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల దేశాలు లాక్డౌన్ అమలు చేశాయి.లాక్డౌన్ వలన జాబ్ రెడుండన్సీ ,పేదల కష్టాలు ,కరోనా బాధితుల కష్టాలు ఇంకా ప్రత్యక్షంగా కనిపించే కష్టాలు అందరికి తెలిసినవే. కానీ పరోక్షంగ జరిగే కష్టాలు నష్టాలు ఇంత అంత కాదు.
- జాబ్ ఉంటుందా /పోతుందా?పొతే ముందు ఏంచేయాలి అనే ఆలోచనలతో కొంతమంది గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోతున్నారు.
- విదేశాలకి టూరిస్టుగా వెళ్లిన వాళ్ళు లాక్డౌన్ వల్ల స్వదేశాలకు తిరిగి వెళ్ళలేక మెడిసిన్ ఇంకా డబ్బులు అయిపోయి నానా కస్టాలు పడుతున్న జనాలు.

- విదేశాలలో చనిపోయిన వాళ మృతదేహాలని కూడా స్వదేశాలకి చేరలేని పరిస్థితులు.

- తల్లిదండ్రులను కోల్పోయి చివరి చూపు దక్కక బాధతో విలవిలలాడిన వాళ పిల్లలు.

- ఎడబాటులో గడుపుతున్నకుటుంబాలు.

ఫ్రెండ్స్ ఇవన్నీ నేను నాకళ్ళతో చూసిన ప్రభావాలు. ఇలాంటి ప్రభావాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పటికైనా కరోనా పోవాలంటే కంట్రీస్ రీఓపెన్ అవ్వాలంటే ఎవరుఇలాంటి భాదలు పడకూడదు అంటే మనమందరం బాద్యులుగా మారాలి.


No comments:
Post a Comment